షిమీ మరియు దావీదు!

2 సమూయేలు  16: 5-13
5రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు  6జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.  7ఈ షిమీనరహంతకుడా, దుర్మార్గుడా  8ఛీపో, ఛీపో,నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా  9 సెరూయా కుమారుడైన అబీషైఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.  10 అందుకు రాజుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగానీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి  11 అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగానా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి.  12  యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.  13అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా   షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.

ఈ వాక్యభాగములో మనము ఇద్దరి వ్యక్తిత్వాలు తెలుసుకొనవచ్చు. ఒకటి షిమీ, రెండు దావీదు. షిమీ సౌలు కుటుంబమునకు చెందినవాడు. అందుకే దావీదు రాజుగా ఉండటం అతడికి ఇష్టం లేదు. దావీదు మీద అతడికి కోపము, ఆక్రోశము. దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు అతడిని తిట్టే ధైర్యం షిమీకి లేదు. అందుకే దావీదు బయటకు వచ్చినప్పుడు, రాజుగా లేనప్పుడు షిమీ ఆయన వెంటపడి తిడుతున్నాడు. షిమీ పరిస్థితిని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి వంటివాడు. దావీదు మరల రాజు అయిన తరువాత షిమీ వచ్చి దావీదుని క్షమాపణ అడుగుతాడు(2 సమూయేలు 19:16,18-23). దావీదు కూడా అతడిని క్షమిస్తాడు, కానీ అతడు ఆ క్షమాపణలో, పశ్చాత్తాపములో నడవడని దావీదుకి తెలుసు. షిమీ లో ఉన్న ఇటువంటి గుణం వల్లనే చివరికి సోలోమను అతడిని చంపిస్తాడు. షిమీ  లాంటి గుణం మనలో కూడా ఉందా? దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తు ప్రసాదించిన క్రొత్త జీవితములో మనం నడుస్తున్నామా?
ఇక్కడ మనం గుర్తించవలసిన రెండవ విషయం, దావీదు యొక్క దయా హృదయం. షిమీ ఎంత తిట్టినా అతడియందు దయ చూపి క్షమించాడు. యేసు క్రీస్తును ప్రజలు ఎంత తిట్టినా, కొట్టినా వారియందు దయ చూపి వారికోసం సిలువ పై చనిపోయారు. మనము కూడా ఇటువంటి క్షమాగుణం, దయాగుణం కలిగియున్నామా?

బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.  బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. -సామెతలు  18: 6,7
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ   తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.  -మత్తయి  5: 43

You May Also Like

One thought on “షిమీ మరియు దావీదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *