కొన్ని వారాల క్రితం మా ఇంటికి సుమారు 40 కి. మీ దూరములో ఉన్న ఒక కొండ (hike) ఎక్కడానికి వెళ్ళాము. ఉదయం 9 గంటలకే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందని 6:30 కి నేను అక్కడికి చేరుకున్నాను. అది చాలా అందమైన ప్రదేశము. వారాంతము కాగానే చాలామంది ఆ కొండ ఎక్కడానికి వస్తారు. కొండ క్రిందనున్న నదిని పైనుండి చూస్తే చాలా బాగుంటుంది. ఈ కొండ ఎక్కడము చాలా మంచి అనుభూతినిచ్చింది. శరీరపరముగా వ్యాయామమే కాకుండా, దేవుని యొక్క అందమైన సృష్టిని ఆహ్లాదించే అవకాశము దొరికింది.
నేను ఆ కొండ ఎక్కుచున్నప్పుడు యేసు ప్రభువు కొండపైకి ఎక్కడము గురించి దేవుడు నాకు గుర్తుచేశారు. యేసు ప్రభువు దూరముగా వెళ్లి కొండ పైకి ఎక్కడానికి గల ముఖ్య కారణం దేవునితో సమయాన్ని గడపడం కోసం. మీరు ఎప్పుడైనా ఎత్తైన కొండలు ఎక్కితే అక్కడ ఎటువంటి సౌండ్స్ ఉండవు. చాలా ప్రశాంతముగా, నిశ్శబ్దముగా ఉంటుంది. ఆ ప్రదేశము చాలా స్వచ్ఛముగా, ఎటువంటి కాలుష్యము లేకుండా ఉంటుంది.
యేసు ప్రభువు ప్రార్ధన చేసుకోవడానికి అటువంటి ప్రదేశం కావాలనుకున్నారు. బహుశా కొండ ప్రాంతం ఎంచుకోవడానికి క్రింద నాలుగు కారణాలు కావచ్చు.
- నిశ్శబ్దముగా, ప్రశాంతముగా ఉండటం
- ఒక చోటనుండే చాలా ప్రదేశాన్ని చూడగలగడం
- ఎటువంటి ఆటంకము (disturbance) లేకపోవడం
- క్రింద ఉన్న ప్రదేశాన్ని వేరొక వైపు నుండి (పై నుండి) చూడటం.
యేసు ప్రభువు ప్రార్ధన చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం కోరుకున్నారు, ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆటంకము ఉండదు, ఎవరు వచ్చి disturb చేయరు. బహుశా ఆయన ఎక్కువ శాతం ఇశ్రాయేలు ప్రాంతాన్ని చూడాలనుకుని ఉండొచ్చు వారికోసం ప్రార్ధన చేయడానికి. ఇంకొక విషయం, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన జీవితములో ఉన్న పరిస్థితులను దేవుని వైపు నుండి చూడొచ్చు. యేసు ప్రభువు కూడా ప్రజల జీవితాలను దేవుని కోణం నుండి చూడాలనుకొంటున్నారు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్ధనలో గడపడం యేసు ప్రభువు చాలా ప్రాముఖ్యమైనది.
బైబిల్ లో యేసు ప్రభువు కొండపైకి వెళ్లినట్లు ఎక్కవుందో ఆ వచనాలు చూద్దాం.
మత్తయి 14:23
ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాల మైనప్పుడు ఒంటరిగా ఉండెను.
మత్తయి 15:29
ఇక్కడ ఒక విషయం గమనిస్తే, యేసు ప్రభువు ఏదైనా ఒక అద్భుతము చేసే ముందు కొండ పైకి వెళ్లి ప్రార్ధన చేశారు. ఒక వచనంలో “మనుష్య కుమారుడు క్షమించగల శక్తి గలవాడు” అని యేసు ప్రభువు అంటారు. ఆయన అద్భుతములు చేయుటకు, క్షమించుటకు గల శక్తి ప్రార్ధన జీవితము ద్వారా, పరలోకపు తండ్రి కి విధేయత చూపడము వలన పొందుకున్నారు.
మార్కు 9:2
2ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను.
లూకా 6:12
12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
లూకా 21:37
37ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
రాత్రి సమయములో ఒలీవ కొండపై ప్రార్ధనలో, పగలు మందిరములో భోదించడము ఆయన చేసేవారు. ఒలీవ కొండపై ఆయన దేవునితో సమయము గడిపేటప్పుడు దేవుడు ఆయనకు మందిరములో ఏమి భోధించాలో నేర్పించి ఉండవచ్చు. అందుకే యేసు ప్రభువు వీలు కుదిరితే కొండపైకి ఒంటరిగా వెళ్లి దేవుని సన్నిధిలో సమయం గడిపేవారు.
దీని అర్ధం మనము కూడా ప్రతిరోజు ప్రార్ధన చేయటానికి కొండపైకి వెళ్లాలని కాదు. దేవునితో సమయం గడపాలన్న ఆశ, ఆతృత, ఆచరణ మనకు ఉండటం ముఖ్యం. యేసు ప్రభువుకు ఉన్న ఆ ఆశ, ఆతృత మనకు ఉన్నాయా? దేవునితో ప్రతిరోజు సమయం గడపాలన్న కోరిక మనలో ఉందా? యేసు ప్రభువుకి అటువంటి కోరిక ఉంది. ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు అయినా కూడా తండ్రి నుండి శక్తిని పొందుకోవడానికి ప్రార్ధన లో సమయం గడపాల్సిన అవసరం ఉంది.
దేవునితో సమయం గడపడం ఎందుకు ముఖ్యం:
మనుష్యుల మధ్యలో అనుబంధం పెరగాలంటే వారు కలిసి సమయాన్ని గడపాలి. అది భార్య భర్తల మధ్యనైనా, తల్లిదండ్రులు పిల్లల మధ్యనైనా, లేదా స్నేహితుల మధ్యనైనా. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి, వారి ఇష్టాలు, అయిష్టాలు, ఇలాంటివి. అప్పుడే వారి మధ్య అనుబంధము పెరుగుతుంది, ఎక్కువ కాలం నిలబడుతుంది. దేవునితో అనుబంధం కూడా అంతే. ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుతూ ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన మాటలకు విధేయత చూపుతూ మన జీవితాలను మార్చుకుంటేనే మనకు దేవునికి అనుబంధం పెరుగుతుంది. దేవునితో సమయం ఎందుకు గడపలో కొన్ని కారణాలు.
- దేవునితో అనుబంధం పెరగడానికి (కొలస్సియులకు 1:10)
- విశ్వాసములో ఎదుగుటకు (రోమీయులకు 10:17)
- క్రీస్తు పోలికలో ప్రతిరోజు జీవించుటకు (2 కొరింథీయులకు 3:18)
- దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకొనుటకు (2 పేతురు 3:18)
- మన జీవితములో పాపములు, చెడు స్వభావమును తెలుసుకొనుటకు (యోహాను సువార్త 16:8)
- మన జీవితములో దేవుని యొక్క చిత్తము తెలుసుకొనుటకు (నిర్గమకాండము 9:16)
- పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వినుటకు (యోహాను సువార్త 14:16-17)
- దేవుని రాజ్య పని కొరకు సిధ్దపడుటకు (1 పేతురు 3:15)
ఉదాహరణకు పాత నిబంధన గ్రంధములో దావీదు జీవితాన్ని తీసుకుంటే, యవ్వన జీవితములో గొఱ్ఱెలు కాచుకుంటూనే దేవునితో సమయము గడిపాడు. ఆయన జీవితమంతా పరిశీలిస్తే దేవునితో సమయాన్ని గడపడాన్ని బట్టి పైన చెప్పిన అన్ని పాయింట్లు ఆయన జీవితములో నెరవేరినవి. ఎంత అసహ్యమైన పాపములో పడిపోయినప్పుడు కూడా పశ్చాత్తాపముతో దేవుని దగ్గరకు తిరిగి రావడానికి దేవునితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని బట్టి సాధ్యమైనది. దావీదుకు దేవునితో ఉన్న అనుబంధం, దేవుడు అతనిని మార్చిన తీరు, దేవుని పని కొరకు అతనిని సిద్ధపరచడం, దేవునితో సమయం గడపాలన్న కోరిక ఆయన వ్రాసిన కీర్తనలు గ్రంథము చూస్తే మనకు అర్ధమౌతుంది.
దేవునితో సమయం ఎలా గడపాలి:
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా సులభం, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించును గాక. చిన్న పిల్లల సండే స్కూల్ లో ఒక english పాట ఉంది. ఆ పాట ఇలా ఉంటుంది.
Read your Bible. (బైబిల్ చదువు )
Pray every day (repeat 3 times). (ప్రతిరోజు ప్రార్ధన చేయి)
Read your Bible. (బైబిల్ చదువు )
Pray every day. (ప్రతిరోజు ప్రార్ధన చేయి)
And you’ll grow, grow, grow (repeat 3 times). (నీవు ఎదుగుతావు)
Read your Bible. (బైబిల్ చదువు )
Pray every day. (ప్రతిరోజు ప్రార్ధన చేయి)
And you’ll grow, grow, grow. (నీవు ఎదుగుతావు)
Don’t read your Bible. (బైబిల్ చదవకపోతే)
Forget to pray (repeat 3 times). (ప్రార్ధన మర్చిపోతే)
Don’t read your Bible. (బైబిల్ చదవకపోతే)
Forget to pray. (ప్రార్ధన మర్చిపోతే)
And you’ll shrink, shrink, shrink (repeat 3 times). (నీవు కృశించెదవు)
Don’t read your Bible. (బైబిల్ చదవకపోతే)
Forget to pray. (ప్రార్ధన మర్చిపోతే)
And you’ll shrink, shrink, shrink. (నీవు కృశించెదవు)
యాలో నేర్పిస్తారు. క్రీస్తుకు సాక్షిగా జీవించుటకు ఆయన సహాయం చేస్తారు. దేవునితో సమయం గడపటంలో బైబిల్ చదవడం, ప్రార్ధన చేయడం తో పాటు దేవుని సంఘముతో సహవాసము కూడా ముఖ్యమైనది. ఆ సహవాసములో దేవుడు ఇతరుల జీవితాలలో ఏమి చేస్తున్నాడో, ఎలా వారిని ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవచ్చును. మనము దేవునికి లోబడితే, సంఘము ఆత్మీయముగా ఎదగడానికి దేవుడు మనందరినీ ఉపయోగించుకుంటారు. దేవునితో సమయం గడపడానికి క్రింద నాలుగు విషయాలు చాలా ముఖ్యము.
- ప్రార్ధన లో గడపడం
- దేవుని వాక్యము చదవడము
- సంఘములో సహవాసము
- లోకములో ప్రభువుకు సాక్ష్యముగా జీవించడం
పైన చెప్పిన విషయాలు మనం అనుసరించినప్పుడు ప్రభువు చెప్పినట్లు మనము ఈ లోకములో వెలుగుగా జీవించగలం. యేసు చెప్పినట్లు శిష్యులను తయారుచేయగలం. లోకములో అందరు నిత్య జీవితమును, పరలోకమును పొందుకొనుటకు వారికి సువార్త ప్రకటించగలం. మనము ఆయన వాక్యమునకు విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా సాక్షిగా ఉండాలో సహాయము చేస్తారు. దానికి మంచి ఉదాహరణ స్టీఫెను జీవితం. అపోస్తుల కార్యములు గ్రంథము లో ఇలా ఉంటుంది.
అపోస్తుల కార్యములు 6:8
8స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
స్తెఫెను ప్రార్ధనలో గడపడం, వాక్యమును చదవడం వలెనే ఆయన దేవుడు అంత బలముగా ఉపయోగించుకున్నారు. ఇంకా అంత అద్భుతమైన సాక్ష్యము మహాసభ ముందు ఇవ్వగలిగాడు. అక్కడ ఉన్నవారికి అతని ముఖము దేవుని ముఖము వలె కనబడినది. 7 వ అధ్యాయములో అబ్రహామునుండి మొదలుకొని యేసు ప్రభువు వరకు, యేసు ఎలా మెస్సయా గా సిలువ పై మన పాప క్షమాపణ కోసం ఎలా బలిఅర్పణ గా అయ్యాడో అద్భుతముగా వివరించాడు. వారందరూ రాళ్లతో కొట్టినా సరే ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గట్టిగా దేవునితో ప్రార్ధించగలిగాడు. క్రీస్తు కొరకు మొట్టమొదటి హత సాక్షిగా చరిత్రలో నిలిచిపోయాడు. దేవునితో స్తెఫేను ప్రతిరోజు ప్రార్ధనలో సమయము గడిపి ఉండకపోతే ఈ విధముగా సాక్ష్యం ఇచ్చేవాడు కాదేమో. ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించి, ఆ వాక్యమునకు విధేయత చూపించడం వల్లే దేవుడు అతనిని వాడుకున్నాడు. దేవునితో సమయం గడపాలన్న బలమైన కోరిక స్తెఫేను కు ఉంది కాబట్టే క్రీస్తుకు హతసాక్షి గా ఉండగలిగాడు.
మనకు కూడా అటువంటి బలమైన కోరిక, ఆశ, ఆతృత, క్రీస్తు కొరకు జీవించగలిగే శక్తి ఆ దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుందాం.