మీరు ధన్యులా?

మత్తయి 5:3-11
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిదిదుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురుసాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురునీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.  కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురుహృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరుసమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురునీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిదినా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

వాక్యములు యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగములో శిష్యులకు బోధించినవి. మనము యేసు క్రీస్తు శిష్యులుగా ఇక్కడ చెప్పినవన్నీ కలిగి ఉండాలి, అప్పుడే మనము లోకములో ఉప్పుగాను, వెలుగుగాను ఉండగలుగుతాం(మత్తయి 5:13,14). మనము ధన్యులు గా ఉన్నామా? ఆలోచించండి. నీతి నిమిత్తము, యేసు క్రీస్తు నిమిత్తము మనము హింసింపబడెదము అని తరువాతి వచనములలో వ్రాసి ఉంది. మనము అటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు సంతోషిస్తున్నామా? లేక విచారిస్తున్నామా? 12 వచనములో దేవుడు మనల్ని సంతోషించి ఆనందించమంటున్నారు. అప్పుడే పరలోకము నందు మన ఫలము అధికమగును. సువార్త నిమిత్తము పౌలుని చెరశాలలో బంధించినప్పుడు ఆయన అక్కడ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించెను అని అపోస్తుల కార్యములులో వ్రాసి ఉంది. పౌలు సంతోషించి ఆనందించుచున్నాడు. మన జీవితములో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించే హృదయము మనము కలిగి ఉండాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *