1 యోహాను 4:19

ఈ రోజు బైబిలు వచనం!


ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. -1 యోహాను 4:19వచనం వివరణ!

కొన్నిసార్లు మనల్ని దేవుడే రక్షణలోకి నడిపించారని మర్చిపోతాం. ఏదో మనమే ఆయనను మొదటగా ప్రేమించినట్లు అనుకుంటాం. మన పశ్చాత్తాపము వలెనే అయన యొద్దకు చేరుకున్నాం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. దేవుడే మనల్ని అయన దగ్గరకు చేర్చుకున్నారు. ఆయనే మనల్ని ముందుగా ప్రేమించారు, ప్రేమిస్తూనే ఉన్నారు. దేవుని ప్రేమను బట్టి మాత్రమే మనం రక్షించబడ్డాం, లేకపోతే ఆయన ప్రేమను పొందే అర్హత మనకు లేదు. ఆ కారణమే మనల్ని దేవుడిని ప్రేమించేందుకు ప్రోత్సహించాలి. దేవునిపైన కృతజ్ఞతతో కలిగిన ప్రేమ మాత్రమే మనల్ని ఇతరులను కూడా ప్రేమించేదిగా చేస్తుంది. మన సొంత కార్యములపై , ఆలోచనలపై ఆధారపడిన ప్రేమ ఎంతోకాలం సాగదు. కావునా కృతజ్ఞతా భావముతో దేవుడిని, ఇతరులను ప్రేమిద్దాం. అంతే కాకుండా దేవుడు మనల్ని మొదటగా ప్రేమించాడని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుని ప్రేమలో ఎదుగుతూ, అటువంటి స్వఛ్చమైన ప్రేమను ఇతరులకు కూడా పంచుదాం.


ప్రార్ధన!

పరలోకమునందున్న మా తండ్రీ, మా పైన మీ మితిలేని ప్రేమను బట్టి మీకు వందనములు. యేసు ప్రభూ, మా కొరకు ప్రాణము పెట్టినందుకై మీకు వేలకొలది స్తోత్రములు. మా రక్షణను బట్టి మీకు స్తోత్రములు. మీరు మొదటగా మమ్మల్ని ప్రేమించారని, ప్రేమిస్తూనే ఉన్నారని నమ్ముతున్నాము. ప్రతి రోజు మీ పైన మా ప్రేమ పెరిగేలా సహాయము చేయండి. ఆ ప్రేమలో మేము ఎదిగేలా, ఆ ప్రేమను ఇతరులకు కూడా పంచేలా మమ్మల్ని సిద్ధపరచండి. మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నిరంతరమూ ప్రేమిచేలా మమ్మల్ని మార్చండి. మేము చేసే ప్రతీ పనిలో, నిత్యము మీరే మహిమ పొందుకొనాలని యేసు క్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమెన్.


You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *