కీర్తనలు 141వ అధ్యాయము

1యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము
2నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
3యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
4పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
5నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.
6వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ ద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు.
7ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మాయెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి.
8యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము.
9నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.
10నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.