యోబు 9వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?
3వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.
4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
5వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనేఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే
6భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే
7ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడుఆయన నక్షత్రములను మరుగుపరచును.
8ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడుసముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.
9ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.
10ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
11ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేనునా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.
12ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?
13దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.
14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
15నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని1 నేనాయనను బతిమాలుకొనదగును.
16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చిననుఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడునిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు
18ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.
19బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగానేనే యున్నానని ఆయన యనునున్యాయవిధినిగూర్చి వాదము కలుగగాప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?
20నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపునునేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.
21నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.ఏమి చేసినను ఒక్కటే.
22కావునయథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.
23సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.
24భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడు?
25పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగాగతించుచున్నవిక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
26రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
27నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
28నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను
29నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
30నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను
31నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
32ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.
33మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.
34ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
35అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను చున్నాను.