1 దినవృత్తాంతములు 1వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

1ఆదాము షేతు ఎనోషు
2కేయినాను మహలలేలు యెరెదు
3హనోకు మెతూషెల లెమెకు
4నోవహు షేము హాము యాపెతు.
5యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
6గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
7యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
8హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
9కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
10కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
11లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
12పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
13కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
14యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
15 హివ్వీయులు అర్కీయులు సీనీయులు
16అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
17షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
19 ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
20 యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
21హదోరమును ఊజాలును దిక్లానును
22 ఏబాలును అబీమా యేలును షేబను
23 ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
24షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
25సెరూగు నాహోరు తెరహు
26అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
27అబ్రాహాము కుమారులు,
28ఇస్సాకు ఇష్మాయేలు.
29వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
30మిష్మా దూమా మశ్శా హదదు తేమా
31యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
32అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
33మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
34అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
35 ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
36ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
37రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
38శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
39 లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
40 శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
41అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
42 ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
43ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
44బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
45యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
46హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
47 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
48శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
49షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
50 బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
51 హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
52అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
53కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
54మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.